దాశరథి కృష్ణమాచార్య అవార్డు కమిటీ ఎంపిక


Thu,April 16, 2015 02:30 AM

Dasarathi Krishnamacharya award selection committee

Dasaradhi

హైదరాబాద్ నమస్తే తెలంగాణ: సుప్రసిద్ధ తెలంగాణ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య పేరిట ప్రతి ఏటా లబ్ధప్రతిష్ఠులైన సాహితీవేత్తలకు అవార్డు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అవార్డుకు అర్హులైనవారిని ఎంపిక చేసేందుకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఈ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ రావికంటి వాసునందన్, ప్రొఫెసర్ మసన చెన్నప్పలు సభ్యులుగా, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. అవార్డుకోసం అర్హులైనవారిని ఈ కమిటీ ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిస్తుంది. అవార్డు గ్రహీతకు 1,01,116 రూపాయల నగదుతోపాటు దాశరథి స్మారక అవార్డును ప్రభుత్వం అందజేయనున్నది.

1541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles