శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 12:31:43

జెడ్పీకో ఆప్షన్ మెంబర్లు జిల్లాల అభివృద్ధికి సహకరించాలి

జెడ్పీకో ఆప్షన్ మెంబర్లు జిల్లాల అభివృద్ధికి సహకరించాలి

హైదరాబద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని ఎండీ మదార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర జెడ్పీ కో ఆప్టేట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జనగామ జిల్లా జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మదార్ మంత్రిని కలిసి పూల మొక్కను అందించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ జెడ్పీ కో ఆప్షన్ మెంబర్లు జిల్లాల అభివృద్ధికి సహకరించాలన్నారు.

జెడ్పీ సభ్యులు రాష్ట్ర జెడ్పీ కో అప్టేట్ ఫోరంగా ఏర్పడటంపై హర్షం వ్యక్తం చేశారు. కమిటీ  సభ్యులుగా ఎన్నికైన వారందరికీ అభినందనలు తెలియజేశారు. కాగా, ఫోరం రాష్ట్ర కన్వీనర్ గడిల కుమార్, రాష్ట్ర నాయకులు వర కుమార్, మాణిక్య రెడ్డి, కొడకండ్ల మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు అందే యాకన్న, ప్రసాద్, రాజు తదితరులు కలిసి నిధులు, విధుల అమలు గురించి మంత్రికి వినతిపత్రం సమర్పించారు. logo