గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 13:26:37

బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన జడ్పీ చైర్‌పర్సన్

బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన జడ్పీ చైర్‌పర్సన్

కుమ్రం భీం ఆసిఫాబాద్ :  జిల్లాలోని వాంకిడి, కెరమెరి మండల కేంద్రాల్లో మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలు జరుపుకునే బతుకమ్మ పండుగను పేదింటి ఆడపడుచులు సైతం సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ద్రుపద, వైస్ ఎంపీపీ కలాం తదితరులు ఉన్నారు.


logo