శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 26, 2021 , 11:44:47

కనకరాజును సన్మానించిన జడ్పీచైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు

కనకరాజును సన్మానించిన జడ్పీచైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు

కుమ్రంభీం ఆసిఫాబాద్ :  కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే ఈ పురస్కారం దక్కింది. కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన కనక రాజు (60)ను పురస్కారం వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యుడైన  ఆయన గుస్సాడీ రాజుగా ప్రసిద్ధి. 1981లో ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో నాటి ప్రధాని ఇందిరా రాగాంధీ, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమక్షంలోనూ రాజు ఈ నృత్యాన్ని ప్రదర్శించారు.

గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తూ యువతకు శిక్షణనిస్తూ తమ ఆచార, సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు బహుమతిగా అందిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ దినోత్సవం సందర్బంగా జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు కనకరాజును సన్మానించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo