శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 14:30:14

మానవత్వం చాటిన జెడ్పీ చైర్ పర్సన్

మానవత్వం చాటిన జెడ్పీ చైర్ పర్సన్

కుమ్రం భీం అసిఫాబాద్ : ఆపదలో ఉన్నవారిని ఆదుకొని  మానవత్వాన్ని చాటారు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి. రోడ్డు ప్రమాదంలో గాయపడి సాయం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు అండగా నిలిచి చేయూతనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే..అసిఫాబాద్ నుంచి జైనూర్ వెళ్తున్న దంపతులు మార్గ మధ్యలో కెరమెరి మండలం చౌపాన్ గూడ గ్రామం వద్ద బైక్ పై నుంచి కిందపడ్డారు. అటుగా వెళ్తున్న జెడ్పీ చైర్ పర్సన్ ప్రమాదాన్ని చూసి తన వాహనాన్ని ఆపి వారిని పరామర్శించారు. 

వారితో చిన్న పాప కూడా ఉంది. ఆ చిన్నారిని అక్కున చేర్చకొని నీళ్లు తాగించారు. అసిఫాబాద్ డాక్టర్‌తో మాట్లాడి వైద్యం అదించాలని సూచించారు. అలాగే వారికి ఆర్థిక సహాయం అందజేసి వారిని ఆటోలో అసిఫాబాద్ దవాఖానకు తరలించారు. ఆపత్కాలంలో అండగా నిలచిన జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మిని పలువురు ఈ సందర్భంగా అభినందించారు.