బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 23:21:33

తాళం చెవి లేకుండానే.. బండి నడపండి

తాళం చెవి లేకుండానే.. బండి నడపండి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌తో  ప్రజారవాణా సహా వాహనాలన్నీ బంద్‌. మరి అత్యవసర సేవల్లో ఉన్నవారు  విధులకు  ఎలా హాజరుకావాలి. సొంత వాహనం ఉన్నవారికైతే  సమస్య ఉండదు. లేని వారి పరిస్థితి ఊహించుకోలేం. ఇలాంటి వారి కోసం జూమ్‌కార్స్‌ సంస్థ కీలెస్‌ యాక్సెస్‌తో వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. డ్రైవర్‌ అవసరం లేకుండా ఎవరికి వారు సొంతంగా కార్లను వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఇలా ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు, డాక్టర్లు, ఆరోగ్యనిపుణులు, డెలివరీ సిబ్బంది రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ వాహనాలను అందుబాటులో ఉంచుతున్నది. తాళం చెవి అవసరం లేకుండా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌చేస్తే వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇలాంటి సేవలను కర్ణాటకలోని మైసూర్‌లో విజయవంతంగా అందిస్తున్నట్లు సంస్థ సీఈవో గ్రెగ్‌మోరెన్‌ తెలిపారు. హైదరాబాద్‌లో అత్యవసర పాసులు పొందిన వారు, జూమ్‌కార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌చేసుకుని సెల్ఫ్‌డ్రైవ్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ సేవలను పొందవచ్చన్నారు.


logo