ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 22:10:10

లక్నవరంలో జిప్‌ సైక్లింగ్‌!

లక్నవరంలో జిప్‌ సైక్లింగ్‌!

గోవిందరావుపేట(ములుగు): ములుగు జిల్లా గోవిందరావుపేటలోని లక్నవరం సరస్సు వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన జిప్‌ సైక్లింగ్‌ పనులు పూర్తి కాగా, శుక్రవారం చేసిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. మరో  రెండు, మూడు   రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు  అధికారులు సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా సరస్సులో సైక్లింగ్‌ బోటును ఏర్పాటు చేశారు. ఒక్కరే సైకిల్‌ తొక్కుకుంటూ 20 నిమిషాల పాటు సరస్సులో తిరుగుతూ ఆహ్లాదకరంగా గడిపేందుకు రూ.200 చార్జీలతో షికారు చేయవచ్చు.