శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 16:39:25

58 డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు సున్నా..

58 డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు సున్నా..

హైదరాబాద్‌ :  రాష్ట్రంలోని పలు డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలేవి నమోదు కాలేదు. ఆయా కళాశాలలు పలు కోర్సులను అందుబాటులో ఉంచినా విద్యార్థులను ఆకర్షించలేకపోయాయి. దీంతో ప్రవేశాల ప్రక్రియ ముగిసే నాటికి అడ్మిషన్ల ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రవ్యాప్తంగా 58 కళాశాల్లో సున్నా ప్రవేశాలు నమోదుకాగా ఈ జాబితాలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గరిష్ఠంగా 19 కళాశాలలున్నాయి.

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 14 కళాశాలు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 10 కళాశాలలు ఉన్నాయి. సింగిల్‌ అడ్మిషన్‌ కూడా నమోదుకాని ఈ 58 కళాశాలల్లో మొత్తం 15,060 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇటీవలే ప్రవేశాల ప్రక్రియ ముగియడంతో ఈ సీట్లనీ ఇక ఖాళీగా ఉన్నట్లే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కారణంగానే ఈ కళాశాలల్లో ఏ ఒక్కరూ చేరేందుకు ఆసక్తి చూపలేదని అధికారులు పేర్కొంటున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.