ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 17:54:51

తెలంగాణ ప్ర‌భుత్వానికి అంబులెన్స్‌లు అంద‌జేసి మాట నిలుపుకున్న 'జీ సంస్థ‌'

తెలంగాణ ప్ర‌భుత్వానికి అంబులెన్స్‌లు అంద‌జేసి మాట నిలుపుకున్న 'జీ సంస్థ‌'

క‌రోనా స‌మ‌యంలో చిన్న సాయం చేసినా అది పెద్ద‌గానే అనిపించింది. ముఖ్యంగా క‌రోనాకు వ్య‌తిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి అండ‌గా జీ సంస్థ నిల‌బ‌డింది. త‌మ వంతు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ప్ర‌భుత్వానికి 20 అంబులెన్స్‌లు, 4 వేల పీపీఈ కిట్ల‌ను విరాళంగా అందించింది. అప్పుడు 20 అంబులెన్స్‌ల‌లో 7 అంబులెన్స్‌ల‌ను మాత్ర‌మే ఇవ్వ‌గ‌లిగింది. మిగిలిన 13 అంబులెన్స్‌ను ప్ర‌త్యేక సౌక‌ర్యాల‌తో త‌యారు చేసి జీ తెలుగు హెడ్ అనురాధ చేతుల మీదుగా ప్ర‌భుత్వానికి అప్ప‌గించారు. ఈ అంబులెన్స్‌ల‌ను ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో అనురాధ గూడూరుతో పాటు కరుణ వాకాటి, ప్రజారోగ్య డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.


logo