మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 17:32:38

వైకాపా అనుచరుల వీరంగం.. ఫీల్ట్ అసిస్టెంట్ పాటు మరో ఇద్దరికి గాయాలు

వైకాపా అనుచరుల వీరంగం.. ఫీల్ట్ అసిస్టెంట్ పాటు మరో ఇద్దరికి గాయాలు

తూర్పు గోదావరి: తమ మాట వినని ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్, అతడి అనుచరులపై వైకాపా కార్యకర్తలు, కాంట్రాక్టర్ దాడి చేసి గాయపరిచిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఎన్ కొత్తపల్లిలో చోటు చేసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం కింద గ్రామంలో నిర్వహిస్తున్న పనికి ఫీల్డ్ అసిస్టెంట్ గురువారం కొలతలు వేస్తుండగా తమ మనుషులు చేసిన పనికి ముందుగా కొలతలు వేయాలని పట్టుబడడంతో అందుకు ఆయన నిరాకరించడంతో వైకాపాకు చెందిన కార్యకర్తలు ఫీల్డ్ అసిస్టెంట్, అతడి అనుచరులపై దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో బాధితులు, దాడికి పాల్పడ్డ వ్యక్తులు వైకాపాకు చెందిన వారే కావడం గమన్హారం.logo