బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 01:38:11

వైద్యానికి రండి

వైద్యానికి రండి

  • మర్కజ్‌ యాత్రికులకు ఏపీ సీఎం జగన్‌ పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70శాతం ఢిల్లీ తబ్లిగీ జమాత్‌ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి 1085 మంది వెళ్లారని.. వారిలో ఇప్పటివరకు 585 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి వచ్చినవారు వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీకి వెళ్లిన వారితోపాటు.. వారితో కాంటాక్ట్‌ అయినవారిని కూడా గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సర్వే చేయిస్తున్నామని తెలిపారు. 

బయటకు రండి

ఆంధ్రప్రదేశ్‌ నుంచి మర్కజ్‌కు వెళ్లివచ్చినవారిలో దాదాపు 450 మంది జాడ తెలియడంలేదు. జిల్లాలవారీగా ఎస్పీలు వారికోసం గాలిస్తున్నారు.


111కి చేరిన  కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 111కి చేరాయి. బుధవారం 67 కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గుంటూరులో 20, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 15 చొప్పున, పశ్చిమ గోదావరిలో 14, విశాఖపట్నంలో 11, తూర్పు గోదావరిలో 9, చిత్తూరులో 6, నెల్లూరులో 3, అనంతపురంలో 2, కర్నూలులో ఒక కేసు నమోదైంది.


logo