గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 21:50:01

యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి

యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ మల్కాజిగిరి : కరోనా కారణంగా ఏడాదిగా ప్రజలు ఇండ్లకే పరిమితమై క్రీడలకు దూరమైయ్యారని, ముఖ్యంగా యువత క్రీడలపై దృష్టి సారించాలని  మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలక వర్గం ఏర్పడి ఏడాది కాలం పూర్తిచేసున్న సందర్భంగా బోడుప్పల్‌ బృందావన్‌ కాలనీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను మంత్రి స్థానిక మేయర్‌ సామల బుచ్చిరెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు.

27వ డివిజన్‌ కార్పొరేటర్‌ బందారం అంజలీ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో మంత్రి క్రికెట్‌ ఆడి యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ..క్రీడలు మానసికంగా,శారీరకదారుఢ్యానికి ఏంతో దోహదం చేస్తాయన్నారు.యువత క్రీడలకు అధికప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఆటల్లో గెలుపోటములు సహజమని, ఎవరు గెలిచినా క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు.


VIDEOS

logo