శనివారం 04 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 14:22:27

వ్యవసాయం వైపు యువత దృష్టి సారించాలి

వ్యవసాయం వైపు యువత దృష్టి సారించాలి

వనపర్తి: వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాదనాపురం మార్కెట్ చైర్మన్ పదవీ స్వీకారోత్సవం కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ రంగం వైపు యువత దృష్టి సారించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెడుతుందన్నారు. దీంతో రైతులు సంప్రదాయ సాగుకు భిన్నంగా అధునాతన పద్ధతుల్లో సాగు చేసి లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. అలాగే మదనాపురం మార్కెట్ యార్డుకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు.


logo