బుధవారం 08 జూలై 2020
Telangana - Jan 26, 2020 , 07:13:01

ఇస్రో ఆధ్వర్యంలో యువవైజ్ఞానిక కార్యక్రమం

ఇస్రో ఆధ్వర్యంలో యువవైజ్ఞానిక కార్యక్రమం

హైదరాబాద్ :  పాఠశాల విద్యార్థులకు మే 11వ తేదీ నుంచి పది రోజులపాటు అహ్మదాబాద్‌, తిరువనంతపురం, షిల్లాంగ్‌, బెంగళూరు నగరాల్లో యువవైజ్ఞానిక కార్యక్రమాన్ని ఇస్రో నిర్వహించనున్నది. 8వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 3 నుంచి 24వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బీ శేషుకుమారి  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రాష్ట్రం నుంచి ముగ్గురిని ఎంపికచేసారని, ప్రముఖశాస్త్రవేత్తలు విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన కల్పించనున్నారని పేర్కొన్నారు. 


logo