శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 15:04:13

యూత్ ఐకాన్ కేటీఆర్ : మంత్రి పువ్వాడ

యూత్ ఐకాన్ కేటీఆర్ : మంత్రి పువ్వాడ

హైదరాబాద్ :  ఐటీ, పుర‌పాల‌క‌, శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాజ‌కీయాల్లో ఓ కొత్త ట్రెండ్ సెట్టర్  అని, యూత్ ఐకాన్ గా అంద‌రిని ఆక‌ర్షిస్తు రాష్ట్ర ప్రగతికి తన వంతు కృషి చేస్తున్న కర్య ద‌క్షుడ‌ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. కేటీఆర్ జన్మదినం సంద‌ర్భంగా శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను కలిసి మొక్క ను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. కేటీఆర్ మంత్రిగా, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స‌క్సెస్ అయ్యార‌న్నారు.

ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రావాల‌నుకునే యూత్ కి కేటీఆర్ ఐకాన్ గా మారార‌న్నారు. సంప్రదాయ రాజ‌కీయాల‌కు భిన్నంగా త‌న‌దైన శైలిలో కేటీఆర్  త‌న కార్యదక్షతను చాటుకుంటున్నార‌ని కొనియాడారు. ఆయన రాజ‌కీయ జీవితం సుదీర్ఘంగా సాగాల‌ని, నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఎంపీ నామా నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి , హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, గాయత్రి రవి తదితరులు ఉన్నారు.


logo