గురువారం 28 మే 2020
Telangana - May 03, 2020 , 16:24:49

కరెంట్‌షాక్‌తో యువకుడు మృతి

కరెంట్‌షాక్‌తో యువకుడు మృతి

జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి మండలం దొంతపూర్‌ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మామిడి కాయలు కోసేందుకు వెళ్లిన సమీర్‌(19) చెట్టు కొమ్మ పైనుంచి వెళుతున్న కరెంట్‌ వైర్‌ తగలడంతో షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెండాడు. మృతుడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన చిలకవాడకు చెందిన వాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని, విద్యుత్‌, రెవెన్యూ అధికారులు తెలిపారు. 


logo