శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 07:00:48

ఇల్లందులో యువ‌తిపై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డ ఉన్మాది

ఇల్లందులో యువ‌తిపై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డ ఉన్మాది

కొత్త‌గూడెం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ యువ‌తిపై ఉన్మాది దాడికి తెగ‌బ‌డ్డాడు. ఇల్లందు స‌త్య‌నారాయ‌ణ‌పురంలో నిన్న అర్థ‌రాత్రి 23 ఏండ్ల యువ‌కుడు యువ‌తిపై క‌త్తితో దాడిచేశాడు. అనంత‌రం స‌మీపంలో ఉన్న ముళ్ల పొద‌ల్లో ప‌డేసి వెళ్లిపోయాడు. ఈ క్ర‌మంలో పెట్రోలింగ్‌ పోలీసుకు తార‌స‌ప‌డ్డాడు. అత‌ని చేతుల‌కు ర‌క్తం అంటి ఉం‌డంతో అనుమానించిన‌ పోలీసులు అస‌లు విష‌యం రాబ‌ట్టారు. యువ‌తిపై దాడిచేసిన‌ట్లు అత‌డు తెల‌ప‌డంతో ఘట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ముళ్లపొద‌ల్లో అప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని ఇల్లందు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మెరుగైన వైద్యం కోసం ఖ‌మ్మం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు తీసుకువెళ్లారు. యువ‌కునిపై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.