సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 08:56:06

మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోం : డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోం : డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

హైద‌రాబాద్ : కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందారు. మహేశ్‌ 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్‌ 6వ తరగతి వరకు వేల్పూర్‌ మండలం కుకునూర్‌ ప్రభుత్వ పాఠశాలలో, 7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్‌ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్‌ ఉన్నారు. మహేశ్‌ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇంటికి వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్లాడు. మహేశ్‌ మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కోమ‌న్‌ప‌ల్లి వాసి మృతిపై రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్పందించారు. ట్విట్ట‌ర్ ద్వారా డీజీపీ స్పందిస్తూ.. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు అన్నారు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేమన్నారు.