శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 02:34:53

ప్రేమించి ముఖంచాటేశాడు..

ప్రేమించి ముఖంచాటేశాడు..

  • ప్రియుడి ఇంటి ఎదుట యువతి బైఠాయింపు 

భీమదేవరపల్లి: తనను ప్రేమించి మొహం చాటేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన సంకినేని సునందకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లికి చెందిన కొన్నె రమేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేండ్లుగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న రమేశ్‌ మూడు నెలలుగా సునందను దూరం పెట్టాడు. ఆరా తీస్తే సెలవులపై వచ్చిన రమేశ్‌కు మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని తెలిసింది. వెంటనే సునంద అతని ఇంటికి వచ్చి తనకు న్యాయం చేయాలని బైఠాయించింది. తనను పెండ్లి చేసుకోకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. బాధితురాలికి ఎమ్మార్పీఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ములుకనూరు ఎస్సై రాజ్‌కుమార్‌ రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 


logo