సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 17:31:46

విషం తాగి యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం

విషం తాగి యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: జిల్లాలోని గుర్రాలపాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు, యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వీరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు వేణు మృతి చెందాడు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  సంఘటన వివరాల్లోకి వెళితే యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. యువకుడి విషయం తెలిసి... యువతి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo