శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:19

బాబోయ్‌.. పెద్దపులి

బాబోయ్‌.. పెద్దపులి

  • రోడ్డు దాటి వెళ్లిన పులి
  • సమీపం నుంచి చూసి బెంబేలెత్తిన యువకులు
  • బెజ్జూర్‌ అటవీ ప్రాంతంలో ఘటన

బెజ్జూర్‌: రోడ్డున పోతూ.. ఉన్నట్టుండి పెద్దపులిని చూస్తే? భ యంతో ప్రాణం గడగడలాడిపోవటం ఖా యం! ఆ సమయం లో ఏం చేయాలో పాలుపోదు! బైక్‌ వే గం పెంచి పారిపోవా లా? లేక బైక్‌ వదిలేసి ఉడాయించాలా.. అర్థంకాదు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ అటవీప్రాంతంలో ఆదివారం ఇద్దరు యువకులకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. అతిసమీపంలో పెద్దపులిని చూసి కంగారుపడిన ఆ యువకులు.. ప్రాణాలు దక్కించుకునేందుకు బైక్‌పైనుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఆ పెద్దపులి మాత్రం వీరిని చూడకుండానే అడవిలోకి వెళ్లిపోయింది. 

పెంచికల్‌పేట్‌ మండలం గుండెపల్లికి చెందిన కుమ్రంపోచయ్య, మడావి మధూకర్‌ సామగ్రి కోసం ఉదయం 7 గంటలకు బైక్‌పై బెజ్జూర్‌కు బయలుదేరారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తిరిగి గుండెపల్లికి వస్తుండగా.. బెజ్జూర్‌ అటవీప్రాంతంలోని మానిక్‌దేవరతల్లి గుడి వద్దకు చేరుకోగానే.. హఠాత్తుగా పెద్దపులి అడ్డువచ్చింది. కేవలం ఐదు మీటర్ల దూరంలోనే పులి ఉండటంతో భయపడ్డ ఆ యువకులు బైక్‌ పైనుంచి దూకి పరుగులు తీసే క్రమంలో గాయపడ్డారు. అరగంట తర్వాత భయం భయంగా మళ్లీ బైక్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ పులి లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆ యువకులు నేరుగా బెజ్జూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుకున్న ఎఫ్‌ఆర్వో దయాకర్‌ పీహెచ్‌సీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. పులికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  


logo