శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 14:56:28

విద్యుదాఘాతంతో యువకుడు మృతి..

విద్యుదాఘాతంతో యువకుడు మృతి..

రామన్నపేట :  హార్వెస్టర్‌కు తీగలు అడ్డురావడంతో తొలగిస్తుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా రామన్నపేట మండలం లక్ష్మీపురంలో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. శోభనాద్రిపురం గ్రామానికి చెందినముక్కాముల మహేశ్‌ (20) లక్ష్మీపురం గ్రామానికి చెందిన హార్వెస్టర్‌ యజమాని వద్ద పనిచేస్తున్నాడు. ఉదయం లక్ష్మీపురం శివారులో వరి కోసేందుకు డ్రైవర్‌కు సాయంగా వెళ్లాడు.

హార్వెస్టర్‌ పొలం కోస్తుండగా విద్యుత్ తీగలు అడ్డురావడంతో తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.