శనివారం 06 జూన్ 2020
Telangana - May 18, 2020 , 21:34:56

చేపల వేటకు వెళ్లి యువకుని మృతి

చేపల వేటకు వెళ్లి యువకుని మృతి

ఖమ్మం  : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని గైగొళ్లపల్లి చెరువులో  చేపల వేటకు వెళ్లి యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గైగొళ్లపల్లి చెరువు కాంట్రాక్టర్‌ చేపలు పట్టుకుని వెళ్లడంతో పరిసర గ్రామాల ప్రజలు చెరువులో మిగిలిన చేపలు పట్టడానికి మూకుమ్మడిగా వెళ్లారు. సమీపంలోని లాల్‌సింగ్‌తండాకు చెందిన బాదావత్‌ హుస్సేన్‌(30) మరి కొందరితో కలిసి గైగొళ్లపల్లిలో సుతారి పనికివెళ్లాడు. 

గ్రామస్తులంతా చేపల వేటకు వెళ్తుండడంతో సుతారి పని వదిలేసి హుస్సేన్‌ అతని అనుచరులు చెరువు వద్దకు వెళ్లారు. ముందుగా చెరువులోకి దిగిన హుస్సేన్‌ లోతైన గుంతలోకి వెళ్లి నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన సహచరులు వారికి ఈత రాకపోవడంతో కేకలు వేశారు. సమీపంలో ఉన్న వారు వచ్చి బయటకు తీయగా అప్పటికే హుస్సేన్‌ మృతిచెందాడు. 


logo