మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:33

నిన్న మంకీ గన్‌.. నేడు ఫర్టిలైజర్‌ గన్‌

నిన్న మంకీ గన్‌.. నేడు ఫర్టిలైజర్‌ గన్‌

  • కొత్త పరికరాల తయారీ..
  • ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు

ఏర్గట్ల: నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్లకు చెందిన యువరైతు మహేశ్‌రెడ్డి సాగులో వినూత్న ఆలోచనలకు శ్రీకా రం చుడుతున్నాడు. పరికరా లను కనుగొంటూ ఆదర్శంగా నిలుస్త్నుడు. మహేశ్‌ ప్రస్తు తం నాలుగు ఎకరాల్లో మక్క జొన్న సాగు చేస్తున్నాడు. మక్క జొన్న మొదళ్లలో యూ రియా వేయడానికి ఖర్చు, సమయం, శ్రమను లెక్కపెట్టి న మహేశ్‌రెడ్డి.. కేవలం రూ. 320 ఖర్చుతో యూరియా గన్‌ తయారు చేశాడు. దీన్ని ఒక సంచి, అర ఇంచు గల రెండు నుంచి మూడు ఫీట్ల పొడవు గల పైపు, ఇంచు క్లిప్పు, ఇంచు డమ్మీ క్లిప్పు, ఫీటు పీవీసీ పైపు, ఒక సాల్వెంట్‌, రబ్బర్‌తో యూరియా ఫర్టిలైజర్‌ గన్‌ను రూపొందించాడు. పైపునకు ఉన్న ట్రిగ్గర్‌ను నొక్కితే యూరియా మక్కజొన్న మొదళ్ల వద్ద పడుతుంది. ఈ గన్‌తో నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరే చేయవచ్చు. మహేశ్‌రెడ్డి గతంలో.. పంటలను కోతులు, పక్షులు, పందులు బారి నుంచి కాపాడేందుకు రూ.500 ఖర్చుతో మంకీగన్‌ తయారు చేశాడు.


logo