బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 17:29:54

కరెంట్‌ షాక్‌తో యువ రైతు మృతి

కరెంట్‌ షాక్‌తో యువ రైతు మృతి

మెదక్‌:  జిల్లాలోని నార్సింగి మండలం జప్తి శివునూర్‌ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రైతు మల్లయ్య మూడవ కుమారుడు సురారం సుధాకర్‌(26) ట్రాన్స్‌ఫార్మర్‌ ఫీజు వేస్తుండగా కరెంటు సరఫరా కావడంతో షాక్‌ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కరెంటు బంద్‌ చేయాలని ఎల్‌సీ తీసుకున్నా కాని విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో రైతు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడని ఇతర రైతులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్‌ అధికారులు మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.


logo
>>>>>>