శనివారం 04 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 19:43:09

కరోనా టెస్ట్‌ చేయాలంటూ యువకుడి హంగామా

కరోనా టెస్ట్‌ చేయాలంటూ యువకుడి హంగామా

కామారెడ్డి : తనకు కరోనా పరీక్ష చేయడం లేదంటూ ఓ యువకుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి హంగామా సృష్టించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీకి చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉండి వచ్చిందనే సమాచారంతో ఆమెకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.

ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఆమె కుమారుడు తనకు కూడా కరోనా పరీక్ష చేయాలని కోరుతూ బాన్సువాడ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నానా హంగామా చేశాడు. దీంతో పోలీస్‌ సిబ్బంది ఆ యువకుడిని కరోనా పరీక్ష చేసేందుకు దవాఖానకు తరలించారు. అంతే కాదు ఆ యువకుడికి కరోనా ఉంటే తమకు కూడా వస్తుందేమో అనే అనుమానంతో పోలీసులు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.logo