సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 23:10:57

భావి తెలంగాణకు యువ భరోసా

భావి తెలంగాణకు యువ భరోసా

వారసత్వం ప్రవేశానికి ఒక మార్గం మాత్రమే. పనితనమే నాయకుడిని నిలబెడుతుంది. నాలుగు కాలాలపాటు ప్రజల నాలుకలపై నడయాడేట్టు చేస్తుంది. పనితనానికి పచ్చని చిరునామా కేటీఆర్‌.ప్రాణాపాయ పరిస్థితుల్లో సైతం ప్రజలతో కలిసి ఉండే నిబద్ధతే కేటీఆర్‌ను విలక్షణ నేతగా నిలబెడుతున్నది. కరోనా కాలంలో ప్రజలకు ధైర్యం చెబుతూ, ప్రాణాలకు తెగించి పనిచేస్తూ.., అవగాహనా రాహిత్యం కారణంగా అవమానాలకు గురవుతున్న పారిశుద్ధ్య కార్మికుల్లో ఆత్మైస్థెర్యం నింపడం కేటీఆర్‌లోని మానవీయతకు నిదర్శనం.

1976 జూలై 24న జన్మించిన కేటీఆర్‌ అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, అక్కడే ఉన్నతోద్యోగం సాధించారు. ఆ సమయంలోనే తెలంగాణలో తన తండ్రి కేసీఆర్‌ నాయకత్వంలో మహోన్నత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అమెరికాలో ఉన్న కేటీఆర్‌ను ఈ ఉద్యమ తరంగాలు తాకాయి. మరో ఆలోచన లేకుండా తాను చేస్తున్న ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ మాగాణంపై వాలిపోయారు. ఇక అప్పటినుంచి మరో ధ్యాస లేదు, తెలంగాణ ప్రజల అభివృద్ధే శ్వాస.

తన ఉనికిని తానే నిలబెట్టుకొని, మహా వృక్షంలా నిటారుగా నిలబడి పది మందికీ నీడనివ్వాలనుకోవడం అరుదైన వ్యక్తిత్వం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కేటీఆర్‌ సొంతం. కాబట్టే ఎలాంటి పదవీ లేకుండా కార్యకర్తగా పనిచేసి రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో, ప్రజల్లో గుర్తింపు, గౌరవం, అభిమానం పొందగలిగారు. అంచెలంచెలుగా ఎదిగి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగారు. రాష్ట్ర మంత్రిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. భావజాలాల కన్నా బతుకులు ముఖ్యం, సిద్ధాంతాల కన్నా చెమటచుక్కలు ఉన్నత మని నమ్మారు కేటీఆర్‌. ఇరు ప్రధాన కాపరులలో తను ఒకడై విరామమెరుగక శ్రమిస్తున్నారు. శరీరానికి వెన్నెముక ఎలాంటిదో ప్రజలకు పార్టీ అలాంటిదనీ, అలాంటి పార్టీకి కార్యకర్తలే సర్వస్వం అని నమ్మి కార్యనిర్వాహక అధ్యక్షునిగా కార్యకర్తలను రక్షించుకుంటున్నారు. 

వ్యవసాయం, పారిశ్రామికం, సేవారంగం.. ఇవి మూడే సమాజ మూలస్తంభాలు, జీవనాధారాలు. ఈ మూడింటి నెలవులు గ్రామాలు, పట్టణాలు, నగరాలు. అందుకే కేటీఆర్‌కు గ్రామం, పట్టణం, నగరం అంటే ప్రాణం. గ్రామాలు మన పట్టుగొమ్మ లు కాబట్టి మొదటగా ఆయన గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారు. ఇప్పుడు పట్టణాభివృద్ధి, ఐటీ మంత్రిగా ఆ రెండు రంగాలపై దృష్టి సారిస్తున్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అనుక్షణం శ్రమిస్తున్నారు. గ్రామం, పట్టణం, నగరం సేవల నిల యం కావాలన్నది కేటీఆర్‌ సంకల్పం. ఉత్పత్తి- సేవలను అనుసంధానించి ప్రగతి రథాన్ని పరిగెత్తించాలన్నది ఆయన ఆశయం. ఆకాశం కోసం భూమి, భూమి కోసం ఆకాశం అన్నట్టు పల్లెకోసం పట్టణం, పట్టణం కోసం పల్లె కలవాలి. ఒక్కరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు నిలవాలి. అప్పడే ఆకలి కేకలు, కష్టాలు, కన్నీళ్లూలేని ఆత్మగౌరవంతో కూడిన జీవితం అనుభవంలోకి వస్తుంది. అందుకోసమే తెలంగాణ కొట్లాడింది. ఆ బాధ్యతను ఇప్పుడు కేటీఆర్‌ తన భుజస్కంధాలపై మోసేందుకు సిద్ధమయ్యారు. అందుకే తెలంగాణ సకలజన హృదయాలకూ చేరువయ్యారు.

పని, ప్రజాసేవ మాత్రమే ప్రజలకు తనను దగ్గర చేయగలవని నమ్మారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్త్తున్నారు. ప్రతి మనిషి గుండెలో తనకింత చోటు సంపాదించుకోగలిగారు కేటీఆర్‌. స్పష్టత, స్వచ్ఛతలతో పాటు నిబద్ధత, నిమగ్నత ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం.

ప్రజల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నవాడే సకలజనుల నాయకుడు కాగలడు. ఏవో కొన్ని కులాలు, మతాలు, వర్గాల కొమ్ముకాచేవాడు కడదాకా నిలబడలేడు.  కేటీఆర్‌ సకలజనుల సర్వోన్నతనాయకుడు. ఆయనెప్పుడూ అందరివాడు. కేటీఆర్‌ ఆలోచన, ఆచరణ సకల సమాజానికి అంకితం. 


కే
కోట్లాది జనులకు 
టీ
తిరుగులేని 
ఆర్
రథసారథి.


గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌logo