గురువారం 09 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 15:17:31

మీరు ఎల్లప్పుడు గుర్తుంటారు సార్‌ : మంత్రి కేటీఆర్‌

మీరు ఎల్లప్పుడు గుర్తుంటారు సార్‌ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ వర్థంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌ జయశంకర్‌ సార్‌కు ఘన నివాళి అర్పించారు. ట్విట్టర్‌ ద్వారా మంత్రి స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్రం కోసం తపించి, తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు ఆచార్య జయశంకర్‌ సార్‌ అని కొనియాడారు. సార్‌ సేవలను స్మరించుకుంటూ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.


logo