గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:05

రైతుల ముఖాల్లో ఆనందం చూడాలి

రైతుల ముఖాల్లో ఆనందం చూడాలి

  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

చిన్నకోడూరు: ‘గ్రామాలకు పూర్వవైభవం రావాలి.. బంగారు పంటలు పండాలి.. రైతు ముఖాల్లో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయం.. రైతే రాజు అన్న నానుడిని తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది’.. అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి, పెద్దకోడూరు, మాచాపూర్‌ తదితర గ్రామాల్లో నిండిన చెరువులు, కుంటలకు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి శనివారం జలహారతి ఇచ్చి, పుష్పాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు కాలంతో.. కరెంట్‌తో పనిలేకుండా గోదావరి జలాలు పొలం వద్దకే వచ్చాయన్నారు. పొలం వాకిట్లోకి నీళ్లు రావాలంటే రైతులంతా పంట కాల్వలు, పిల్ల కాల్వలు తవ్వడానికి సహకరించాలన్నారు. సిద్దిపేట వాగుపై మొత్తం 28 చెక్‌డ్యాంలు ఉండగా 15 నిండుగా ఉన్నాయన్నారు.  


logo