గురువారం 16 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 12:33:08

జీవితాన్ని పొడిగించుకునేందుకే కాదు యోగా అంటే : కవిత

జీవితాన్ని పొడిగించుకునేందుకే కాదు యోగా అంటే : కవిత

హైదరాబాద్‌ : ప్రపంచ యోగా దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. మన జీవితాన్ని పొడించుకునేందుకు చేసేది మాత్రమే కాదు యోగా అంటే.. మన జీవిత సంవత్సరాల్లో జీవం ఉండేలా చేసేది కూడా యోగానే అని అన్నారు. యోగాను తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా శ్వాస యోగా పద్దతులు తనకు వ్యక్తిగతంగా ఎంతో సహాయపడ్డాయన్నారు. తనను ఈ మార్గంలో నడిపిన కజిన్‌ సౌమ్యకు అదేవిధంగా తన యోగా షెషన్లను అర్థవంతంగా మార్చిన స్వేత తల్లూరికి కవిత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.


logo