మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 01:46:36

యాసంగి అంచనా 77 లక్షల టన్నులు

యాసంగి అంచనా 77 లక్షల టన్నులు
  • కొనుగోళ్లకు పకడ్బందీఏర్పాట్లుచేయాలి
  • మంత్రివర్గ ఉపసంఘం సమీక్షలోఅధికారులకు ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏప్రిల్‌ ఒకటోతేదీ నుంచి ప్రారంభమయ్యే యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. యాసంగిలో 77.73లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం రాగలదని అంచనావేస్తున్నట్టు తెలిపింది. యాసంగి కార్యాచరణపై సోమవారంనాడు హాకాభవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఆ సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది యాసంగిలో 37లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేయగా, ఈ ఏడాది అంతకు రెండింతలు దాటవచ్చని అంచనావేశారు. ఆ మేరకు కొనుగోళ్లకు ఏర్పాట్లుచేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, స్టోరేజీ స్పేస్‌, రవాణా తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రామరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కేశవులు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి ఇతర అధికారులు పాల్గొన్నారు.  


logo
>>>>>>