మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 02:33:19

యక్షగాన కళాకారుడు దేవదాసు మృతి

యక్షగాన కళాకారుడు  దేవదాసు మృతి

సిద్దిపేట టౌన్‌: చిందు యక్షగాన, తెలంగాణ సాం స్కృతిక సారథి కళాకారుడు పిల్లిట్ల దేవదాసు(50) సోమవారం కరోనాతో మరణించారు. ఆయన తండ్రి పదిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో దేవదాసు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యా డు. యక్షగాన సంప్రదాయ జానపద కళనే తన జీవన ఉపాధిగా మలుచుకొని జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేలా ది ప్రదర్శనలు ఇచ్చి పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథిలో ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. 

మంత్రి హరీశ్‌రావు సంతాపం..

దేవదాసు మృతిపట్ల ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి దేవదాసు తన పాటతో ఉత్తేజాన్ని ఇచ్చారన్నారు. సాంస్కృతిక సారథి కళాకారునిగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ఊరూరా ప్రచారం చేశారన్నారు. సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ కూడా సంతాపం ప్రకటించారు. 

మాజీ మంత్రి పెన్మత్స కన్నుమూత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్‌ నేత పెన్మత్స సాంబశివరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. గజపతినగరం, సతివాడ నుంచి వరుసగా గెలుపొందారు. 1989-94లో మంత్రిగా పనిచేశారు. 

తాజావార్తలు


logo