శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 23, 2020 , 00:54:11

మరింత వేగంగా యాదాద్రి పనులు

మరింత వేగంగా యాదాద్రి పనులు

  • వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు

యాదాద్రి భువనగిరి, నమస్తే తెలంగాణ: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శిల్పి పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రధాన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు. మిగతా పనులు వేగంగా పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో కిషన్‌రావు మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండునెలలుగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలన్నారు. యాదాద్రిలో అనుకున్న విధంగా అన్నిదిక్కు ల్లో ఆరు మహారాజగోపురాలు, గర్భగుడిపై దివ్య విమాన నిర్మాణ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఆలయ పనుల విషయంలో సీఎం దృఢ సంకల్పంతో ఉన్నారని, అందుకు అనుగుణంగా పనులు పూర్తిచేయాలని  సూచించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో గీత, చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ మధు, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, స్ట్రక్చర్‌ ఇంజినీర్లు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, స్తపతులు సంజయ్‌, మొగిలి, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.logo