e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home Top Slides రెండున్నర నెలల్లో యాదాద్రి

రెండున్నర నెలల్లో యాదాద్రి

  • వేగంగా పునర్నిర్మాణ పనులు కావాలి
  • 20 లక్షలమంది భక్తులకు సౌకర్యాలు
  • పనులు జరగనిచోట ఏజెన్సీని మార్చండి
  • రింగ్‌రోడ్డు పరిధి భూములపై సర్వే
  • టెంపుల్‌టౌన్‌ కాటేజీలకు త్వరలో టెండర్లు
  • ఆర్టీసీ బస్టాండ్‌, డిపో నిర్మాణానికి నిధులు
  • యాదాద్రిపై సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 21 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను రెండున్నరనెలల్లో పూర్తిచేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 20 లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయేలా సౌకర్యాలు ఉండాలని స్పష్టంచేశారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చినందున వేగంగా ఏకకాలంలో అన్నిరకాల పనులను కొనసాగించాలని సూచించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రిని సందర్శించారు. తొలుత ఆలయ రింగ్‌రోడ్డు చుట్టూ పర్యటించి నిర్మాణాలను పరిశీలించారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ క్యూలైన్‌ను, పసిడి విద్యుత్‌ కాంతులు వెదజల్లేలా ఏర్పాటుచేసిన ఆలయ లైటింగ్‌ను పరిశీలించారు. ఆలయం బయట, లోపల నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఈవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కడుపు నిండా పరిహారం
రింగ్‌రోడ్డు పరిధిలో ఉన్న కొందరు ప్రైవేటు వ్యక్తులు తమకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందించగా, వారిని ఈవో కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తామని హామీఇచ్చారు. కడుపునిండా పరిహారం ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసాఇచ్చారు. టెంపుల్‌సిటీలో షాపులు కేటాయించడంలో వీరికి ప్రాధాన్యతనిచ్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రింగురోడ్డులోపల 5 వేల వాహనాల సామర్థ్యంతో పారింగ్‌ ఏర్పాటుచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్‌, భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పతి, వైటీడీఏ స్పెషలాఫీసర్‌ కిషన్‌రావు, ఈవో గీత, ఆరిటెక్ట్‌ ఆనంద్‌సాయి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, సీపీ మహేశ్‌భగవత్‌, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ తదితరులు ఉన్నారు.

- Advertisement -

రింగ్‌రోడ్డు పరిధిలోపల ఆలయ నిర్మాణాలే
రింగ్‌రోడ్డు పరిధిలోని భూములపై డీజీపీఎస్‌ సర్వే అత్యవసరంగా నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రింగ్‌రోడ్డు లోపల ఆలయ సంబంధిత నిర్మాణాలే ఉండాలని స్పష్టంచేశారు. పనుల్లో అలసత్వం పనికిరాదని ఆలయం లోపల, అనుబంధ నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని అన్నారు. క్యూ కాంప్లెక్స్‌ బిల్డింగ్‌, ఎసలేటర్లు, ఆర్నమెంటల్‌ ఎలివేషన్‌, ల్యాండ్‌ సేపింగ్‌, బీటీ రోడ్‌, పుషరిణి, కల్యాణ కట్ట, కార్‌ పారింగ్‌ ఇతర నిర్మాణాల పనుల తీరుపై ఆరాతీశారు. పనులన్నీ రెండున్నర నెలల్లో పూర్తిచేయాలని చెప్పారు. పనులు వేగంగా జరగని చోట వరింగ్‌ ఏజెన్సీలను మార్చాలని సూచించారు. ఆలయానికి అధునాతన విద్యుద్దీపాలు అమర్చాలని అన్నారు. టెంపుల్‌టౌన్‌లో చేపట్టే కాటేజీల నిర్మాణానికి వైటీడీఏ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి, అద్భుతంగా నిర్మించే వరింగ్‌ ఏజెన్సీలకు అప్పగిస్తామని తెలిపారు. ఆలయంపైకి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయం ప్రారంభమైతే భక్తులు భారీగా తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. బస్‌డిపో, బస్టాండ్‌ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని, వారంలోగా పనులను ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అవసరాల ప్రాతిపదికన నిర్మాణాన్ని విస్తరించుకోవాలని, మూడు నెలల్లోగా ఈ పనులు పూర్తికావాలని ఆదేశించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana