గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 09, 2020 , 02:33:31

సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు షురూ

సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు షురూ

  • శంఖు, చక్ర, నామాలకు ఆర్కిటెక్ట్‌, స్థపతుల పూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ: అద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులను మంగళవారం ప్రారంభించారు. ఆలయానికి తూర్పున ప్రాకార ద్వారంపై ఏర్పాటు చేసే శంఖు, చక్ర, నామాల విగ్రహాలకు ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, ప్రధాన స్థపతి ఆనందచార్యుల వేలు, ఉప స్థపతి గణేశ్‌, ఇతర స్థపతులు పూజలు చేశారు. అనంతరం సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఆలయానికి నలుదిక్కులా గరుడ, సింహాల విగ్రహాల ఏర్పాటు పనులను కూడా మొదలు పెట్టారు. శివాలయంలో నంది విగ్రహా ఏర్పాటు పనులు ప్రారంభించారు. 

యాదాద్రిలో మూడ్రోజులు దర్శనాలు నిలిపివేత

యాదాద్రి ఆలయంలో బుధవారం నుంచి మూడ్రోజులపాటు స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఈనెల 9 నుంచి మూడ్రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. స్వామివారి నిత్య కైంకర్యాలు, ఆన్‌లైన్‌ సేవలు ఏకాంతంగా యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. 


logo