గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 28, 2020 , 02:14:17

యాదాద్రిలో ధ్వజారోహణం

యాదాద్రిలో ధ్వజారోహణం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాతాహ్వానం, భేరీపూజ తదితర తంతులను ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు.  శుక్రవారం స్వామివారిని పెండ్లికుమారుడిగా అలంకరించనున్నారు. ఉదయం వేదపారాయణం, మత్స్యావతార అలంకారసేవ, రాత్రి శేషవాహనసేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు నల్లందిగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, యాజ్ఞీకులు శేషం ప్రణీతాచార్యులు  ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.  


logo