బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 01, 2020 , 01:52:18

కృష్ణావతారంలో లక్ష్మీనారసింహుడు

కృష్ణావతారంలో లక్ష్మీనారసింహుడు
  • హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాలను నాలుగో రోజైన శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం పిల్లనగోవి ఊదుతున్న మురళీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు సాయంత్రం బాలాలయంలో హంసవాహనంపై ఊరేగారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్‌ గీత, అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వటపత్రసాయి అలంకారసేవలో దర్శనమివ్వనున్నారు. రాత్రి పొన్నవాహనంపై బాలాలయంలో విహరిస్తారు.


logo