శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 22:27:18

వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎదుర్కోలు..

వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎదుర్కోలు..

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బాలాలయంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కలెక్టర్ అనితారామచంద్రన్ స్వామివారి ఎదుర్కోలు మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ వేడుక జరుగనుంది.  
logo