ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:41:03

రేపటి నుంచి దైవ దర్శనం

రేపటి నుంచి దైవ దర్శనం

  • ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఎట్టకేలకు భక్తులకు భగవంతుడి దర్శనభాగ్యం కలుగనున్నది. లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 80 రోజుల తర్వాత సోమవారం నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ, యాదాద్రి, భద్రాద్రితోపాటు ధర్మపురి, కొండగట్టు ఆలయాల్లో భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  వేములవాడ రాజన్న సన్నిధిలో కోడెమొక్కు, తలనీలాల సమర్పణ, గర్భాలయంలో అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కల్యాణాలు, ఇతర శాశ్వత ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు, వసతి గృహాల కేటాయింపు రద్దు చేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్థుల వారికి దర్శనానికి అనుమతి ఇవ్వట్లేదు. ఆలయాల ప్రధాన ద్వారాల వద్ద భక్తులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంతోపాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కాగా, రాజన్న ఆలయంలో భక్తులకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నారు.


logo