బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:27:47

యాదాద్రిలో ఘనంగా ఎదుర్కోలు

యాదాద్రిలో ఘనంగా ఎదుర్కోలు

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మం గళవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామికి వరపూ జ, వధువు లక్ష్మీదేవికి పూలుపండ్లు కార్యక్రమా న్ని నిర్వహించారు. పట్టువస్ర్తాలు.. వజ్రవైడూర్యాలు ధరించిన పంచనారసింహుడు అశ్వవాహనంపై మండపానికి చేరుకున్నారు. అప్పటికే లక్ష్మీదేవి ముగ్ధమనోహర రూపంతో ముత్యాల పల్లకీపై ఆసీనురాలై ఉంది. ఎదురెదురుగా కూర్చున్న శ్రీవారు, లక్ష్మీ అమ్మవారల పెండ్లిచూపుల తం తును అర్చక బృందం, వేదపండితులు నిర్వహించారు. ఈ వేడుకలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఆలయ ఈవో ఎన్‌ గీత, అనువంశిక ధర్మకర్త బీ నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.


నేడు కల్యాణోత్సవం

బుధవారం తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉదయం బాలాలయంలో జరిగే కల్యాణోత్సవానికి హాజరై స్వామివారు, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. 


టీటీడీ పట్టువస్ర్తాల సమర్పణ 

టీటీడీ పంపించిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ బోర్డు సభ్యులు కే శివకుమార్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ ఈవో హరినాథ్‌ సమర్పించారు. కాగా మంగళవారం ఉదయం స్వామివారు జగన్మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు.


logo
>>>>>>