మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 01:48:32

కల్యాణ వైభోగమే..

కల్యాణ వైభోగమే..
  • కన్నుల పండువగా యాదాద్రీశుడి తిరుకల్యాణం
  • పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి తిరుకల్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. అభిజిత్‌ లగ్నంలో శ్రీస్వామివారికి, అమ్మవారికి బాలాలయంలో వివాహం నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌ డాక్టర్‌ రాజాసదారాం సోమ, కమిషనర్‌ బుద్దా మురళి, జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. 


రాత్రివేళ కొండ కింద జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో మాంగల్యధారణ ఘట్టాన్ని వైభంగా నిర్వహించారు. దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సాయంత్రం శ్రీవారిని దర్శించుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ఈవో గీతతో చర్చించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 400 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేసినట్టు యాదగిరిగుట్ట ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి తెలిపారు.


logo
>>>>>>