ఎన్జీఆర్‌ఐ యువశాస్త్రవేత్తలకు ముగిసిన శిక్షణ


Thu,March 22, 2018 01:21 AM

Training for NGRI young scientists

-భూరసాయనశాస్త్ర ఆధునిక పద్ధతులపై అవగాహన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్‌ఐ)లో భూరసాయన శాస్త్ర ఆధునిక విశ్లేషణా పద్ధతులపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండ లి ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి యువశాస్త్రవేత్తలకు శిక్షణ నిర్వహించారు. భూగర్భశాస్ర్తానికి సంబంధించిన పలు వైజ్ఞానిక ఆధునిక పరికరాలు, ఉపయోగాలపై అవగాహన కల్పించారు. శిలాజాలు, శిలాద్రవం, వాటిపుట్టుక, వివిధ రకాల మూలకాల విశ్లేషణ, సాంద్రత, వ్యాపనం, వాటి స్థితిగతులు, ఖనిజాన్వేషణ, వాటి ప్రాముఖ్యం వంటి అంశాలపై ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలతో పాటు పలు వర్సిటీల సీనియర్ సైంటిస్టులు వివరించారు. ముగింపు కార్యక్రమానికి గోవా జాతీయ సముద్ర విజ్ఞానసంస్థ సంచాలకుడు ప్రొఫెసర్ సునీల్‌సింగ్ హాజరై శిక్షణలో పాల్గొన్నవారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐ ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ షకీల్ అహ్మద్ అధ్యక్షత వహించగా, ఎన్జీఆర్‌ఐ సంచాలకులు డాక్టర్ వీఎన్ తివారీ, శాస్త్రవేత్తలు డాక్టర్ సీ మాణిక్యాంబ, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ డీ శ్రీనివాస్ హాజరయ్యారు.

727
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles