గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా అయాచితం శ్రీధర్


Thu,February 16, 2017 01:59 AM

Library Parishad chairman ayacitam Sridhar

sridhar హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా డాక్టర్ అయాచితం శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయాచితం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. చైర్మన్‌గా తనను నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలు నూతన రూపురేఖలు సంతరించుకునేలా కృషిచేస్తానని చెప్పారు. గ్రంథాలయ వ్యవస్థ సక్రమంగా నిర్వహించేందుకు గత ఉద్యమకారులతో కలిసి పనిచేస్తానన్నారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు సీనియర్ మంత్రులతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు. రచయిత అయిన అయాచితం శ్రీధర్ తెలంగాణ వికాస సమితికి సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో హైదరాబాద్ జేఏసీకి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు.

3655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles