మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 08:33:00

మహాకవి దోర్బల విశ్వనాథ శర్మ కన్నుమూత

మహాకవి దోర్బల విశ్వనాథ శర్మ కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, మహాకవి దోర్బల విశ్వనాథశర్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న అర్ధరాత్రి మరణించారు. 1931లో ఉమ్మడి మెదక్‌ జిల్లా రామాయం పేటలో జన్మించారు. సంస్కృతాంధ్ర భాషలో అపార పాండిత్యాన్ని సంపాదించారు. ఆయన రచించిన ‘శ్రీలాలిత్యం’ విశేష ప్రాచుర్యం  పొందింది సంస్కృత, తెలుగు భాషల్లో వేల సంఖ్యలో శతకాలు, కావ్యాలు, వ్యాఖ్యానాలు రచించారు. రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారంతోపాటు, ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు, సత్కారాలు పొందారు. తెలంగాణ విద్వత్సభ రాష్ట్ర మహాసభ సందర్భంగా మహోన్నత సేవాసత్కారంతో సమ్మానించింది.


logo