మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 11:22:32

బాసరలో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు

బాసరలో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు

నిర్మల్ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అనుమతినిచ్చారు. నేటి నుంచి ఆర్జిత సేవ పూజలు, అభిషేకం ,హారతి, అక్షరాభ్యాసం పూజలు అర్చకులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


logo