ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:40:30

కోటి చింత మొక్కలు

కోటి చింత మొక్కలు

  • భవిష్యత్‌లో చింతపండు దిగుమతి ఉండొద్దు
  • ఆరోవిడుత హరితహారంపై మంత్రి అల్లోల సమీక్ష

హైదరాబాద్‌/ నిర్మల్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు హరితహారం ఆరోవిడుతలో కోటి చింత మొక్కలు నాటాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాష్ర్టానికి చింతపండు దిగుమతి అవసరం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల 20న ఆరోవిడుత హరితహారం ప్రారంభంకానున్న నేపథ్యంలో నాటిన మొక్కలను వందశాతం బతికించాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు. 

శనివారం నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంనుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కరోనా నేపథ్యంలో హరితస్ఫూర్తిని చాటేలా తెలంగాణకు హరితహారం లోగోతో ఉన్న ఆకుపచ్చని మాస్కులు ధరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు అడవుల బయట 151 కోట్లు, అడవుల్లో 30 కోట్ల మొక్కలు నాటినట్టు పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వివరించారు. అటవీశాఖ నాటిన మొక్కలు ఎక్కువగా బతికాయని చెప్పారు. 


logo