బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 20:16:13

ప్ర‌పంచ ఏనుగు దినోత్స‌వానికి రాగి కేకుల‌తో సెల‌బ్రేట్ చేసిన హైద‌రాబాద్ జూపార్క్‌

ప్ర‌పంచ ఏనుగు దినోత్స‌వానికి రాగి కేకుల‌తో సెల‌బ్రేట్ చేసిన హైద‌రాబాద్ జూపార్క్‌

హైద‌రాబాద్ :  నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్‌లో ఈ రోజు ఘ‌నంగా ప్ర‌పంచ ఏనుగుల‌ దినోత్స‌వం జ‌రిగింది. రాగి కేకుల‌తో సెల‌బ్రేట్ చేశారు. ప్ర‌తి ఏడాది ఆగ‌స్టు 12న ప్ర‌పంచ ఏనుగు దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. ఈ రోజు ఏనుగుల‌ను అలంక‌రించి బాగా చూసుకుంటారు. రాగి, బియ్యంతో త‌యారు చేసిన కేకుతో పాటు పండ్లు, కూర‌గాయ‌లు, మొల‌క‌లు, మొక్క‌జొన్న‌లు ఉన్న కేకును త‌యారు చేసి ఏనుగుల ముందు ఉంచారు. 

వీటితోపాటు చెరుకు, పైనాపిల్‌, బెల్లం, కొబ్బ‌రి, ప‌చ్చ‌టి గ‌డ్డి వంటివి ఇష్ట‌మైన ఆహార ప‌దార్థాల‌ను కూడా పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను నెహ్రూ జూ పార్క్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఐదు ఏనుగులున్నాయి. వీటిలో ఒక‌టి మాత్ర‌మే మ‌గ‌. మిగిలిన‌వి ఆడ‌పిల్ల‌లే. దీనిలో ఒక‌దాని పేరు రాణి. దానికి 82 సంవ‌త్స‌రాలు. 


logo