శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 19:43:13

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

హైదరాబాద్‌: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం స్థానిక సంస్థలకు ఆదేశాలు వచ్చేలా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఎంవీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్నిఆన్‌లైన్‌లో నిర్వహించారు.

ఉత్తర భారతంలో కంటే దక్షిణ భారతంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థల కృషి తక్కువగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో పంచాయతీరాజ్‌ చట్టంలో అనేక మంచి మార్పులు జరిగాయని అన్నారు. ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ ఆర్‌. వెంకట్‌రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. 


logo