బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 20:09:26

త్వరలో ఉప్పుగల్‌ రిజర్వాయర్‌ పనులు: ఎర్రబెల్లి

 త్వరలో ఉప్పుగల్‌ రిజర్వాయర్‌ పనులు: ఎర్రబెల్లి

జనగామ: ఉప్పుగల్‌ రిజర్వాయర్‌ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రిజర్వాయర్‌ పనుల నిర్మాణంపై తమతో సమీక్ష జరిపారని తెలిపారు. త్వరలోనే ఈ-టెండర్లను పిలుస్తామని పేర్కొన్నారు. జనగామ జిల్లాలోని స్టేషన్‌ ఘనపూర్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి సందర్శించారు. తాలసేమియా వ్యాధిగ్రస్థులను కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో దాదాపు 70 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఐఆర్‌సీఎస్‌ ప్రతినిధులు తెలిపారు.


logo