శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 21, 2020 , 17:06:37

కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం: మేయర్‌

కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం: మేయర్‌

హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా నగరంలోని యాచకులను గుర్తించి ఏవీ హోమ్‌, జింఖానా గ్రౌండ్స్‌, అమీర్‌పేటలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ షల్టర్‌ హోమ్స్‌కు తరలించామని చెప్పారు. వారికి అన్ని వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఆహార పదార్థాలవంటివి ఇవ్వదల్చుకున్న దాతలు జీహెచ్‌ఎంసీకి సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాకాకుండా వారే నేరుగా పంపిణీ చేస్తే వైరస్‌ వ్యాపించే అవకాశం ఉండటంతో విపత్తుల నిర్వహణ చట్టం కింద పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.


logo